Today Gold Rate: పసిడి ప్రియులకు అదిరిపోయే వార్త.. తులంపై రూ. 5వేలు తగ్గింపు.. నేడు భారీగా తగ్గిన బంగారం ధర

Update: 2024-12-02 23:57 GMT

Today Gold Rate: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు డిసెంబర్ 3 మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,770పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,400గా ఉంది.

Today Gold Rate: బంగారం ధరలు నవంబర్ నెలలో ఆల్ టైం రికార్డును తాకి..ఒక దశలో 84వేల రూపాయల వరకు వెళ్ళాయి. అక్కడి నుంచి బంగారం ధర తగ్గుతూ నెమ్మదిగా ప్రస్తుతం 78వేల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికాలో డాలర్ విలువ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో బంగారం ధఱలు తగ్గుముఖం పడుతున్నాయి.

ఎందుకంటే డాలర్ విలువ పెరిగే కొద్దీ పెట్టుబడిదారులు డాలర్ బాండ్లలో పెడతారు. అప్పుడు బంగారం నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని ఎక్కువ లాభం అందించే డాలర్ బాండ్లలో పెట్టుబడి పెడతారు. ఫలితంగా బంగారం ధరలు భారీగా తగ్గుతాయి.

అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ జనవరి 25వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ట్రంప్ ఇప్పటికే అమెరికా ఇక నుంచి ప్రొటెక్సనిజం విధానాలు అవలంబిస్తుందని తెలిపారు. దీంతో అక్కడి స్టాక్ మార్కెట్లు పాజిటివ్ గా స్పందించాయి. ఫలితంగా బంగారం ధరలు భారీగా తగ్గి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఎందుకంటే బంగారంపై పెట్టుబడి పెట్టిన పెట్టుబడి దారులు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించి స్టాక్ మార్కెట్లలో పెట్టుకునే అవకాశం ఉంది.

అయితే భవిష్యత్తులో బంగారం ధరలు కూడా తగ్గుతాయా లేదా అనే అనుమానం చాలా మంది ఉంది.  

Tags:    

Similar News