SBI: ఎస్బిఐ నుంచి అదిరిపోయే సరికొత్త స్కీమ్..డిసెంబర్ 4 నుంచి ప్రారంభం..కనీస పెట్టుబడి ఎంతంటే?

Update: 2024-12-02 05:40 GMT

SBI Jobs: నిరుద్యోగులకు శుభవార్త..ఈ ఏడాది 10,000పోస్టుల భర్తీకి ఎస్బిఐ ప్లాన్

SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయితే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ మరో కొత్త స్కీమును తీసుకువస్తుంది. ఎస్బీఐ క్వాంట్ ఫండ్ పేరుతో న్యూ ఫండ్ ఆఫర్ ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్ సబ్ స్క్రీప్షన్ డిసెంబర్ 4వ తేదీ నుంచి షురూ కానుంది.

ఈక్వీటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు రెండు మార్గాలు ఉంటాయి. నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టువడి పెట్టడం. ఈమధ్యకాలంలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా రకాల ఫండ్స్ హైరిటర్న్స్ ఇస్తుండటం, ఈజీగా పెట్టుబడి పెట్టేందుకు ఛాన్స్ ఉండటం వంటి కారణాలు చెప్పవచ్చు. ఈ క్రమంలోనే చాలా అసెట్ మెనేజ్ మెంట్ సంస్థలుకొత్త కొత్త ఫండ్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ వారం మరో కొత్త స్కీము తీసుకువచ్చింది. అదే ఎస్బిఐ క్వాంట్ ఫండ్ డైరెక్ట్.

ఎస్బిఐ క్వాంట్ ఫండ్ డైరెక్ట్ ఫండ్ అనేది ఒక ఈక్విటీ ఫోకస్డ్ ఫండ్. ఇది మంచి నిర్మాణాత్మక పెట్టుబడి పరిష్కారాన్ని అందిస్తుంది. ప్రొప్రైటరీ క్వాంటిటేవిట్ మోడల్ ఉపయోగించి, ఫండ్ డైనమిక్, బ్యాలెన్స్డ్ పోర్ట్ పోలియోను నిర్మించేందుకు, సాంకేతిక అంశాలను కూడా ఏకీక్రుతం చేస్తుంది. ఈ స్కీమ్ రిస్కులను ప్రభావవంతంగా నిర్వహించేలా రూపొందించినట్లుగా ఏఎంసి తెలిపింది. దీర్ఘకాలంలో పెట్టుబడులపై హైరిటర్న్స్ అందిండం లక్ష్యంగా ఈ ఫండ్ ను తీసుకువస్తున్నట్లు పేర్కొంది.

ఎస్ బీఐ క్వాంట్ ఫండ్ అనేది ఈక్విటీ థెమాటిక్ కేటగిరీకి చెందిన ఫండ్. ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్ స్క్రిప్షన్ డిసెంబర్ 4, 2024 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 18వ తేదీ వరకు సబ్ స్క్రైబ్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ స్కీమ్ కనీస పెట్టుబడి రూ. 5వేలుగా ఉంది. ఆ తర్వాత ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఎంట్రీ లోడ్ ఉండదు.

Tags:    

Similar News