Gold Rate Today: బిగ్ షాక్..వరుసగా తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర..హైదరాబాద్ లో తులం ఎంతంటే?
Gold Rate Today: పసిడి ప్రియులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బంగారం ధర మళ్లీ సడెన్ గా పెరిగింది. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్ సహా అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగానే పెరిగాయి. దీంతో దేశీయంగా మరోసారి 22క్యారెట్ల బంగారం ధర రూ. 72వేల మార్కు పైకి చేరింది. వెండి ధరలు కూడా పెరిగాయి.ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఈ మధ్య కాలంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. నవంబర్ 25,26 తేదీల్లో భారీగా తగ్గింది. నవంబర్ 27వ తేదీన స్వల్పంగా తగ్గింది. తర్వాత రోజు మళ్లీ స్వల్పంగా తగ్గగా ఇప్పుడు ఒక్కసారిగా ధరలు పెరిగాయి. మళ్లీ తగ్గి సామాన్యలుకు అందుబాటులోకి వస్తుందన్నకున్న బంగారం ధరలు.. పసిడి ప్రియులకు మరోసారి షాకి ఇచ్చాయి. దేశీయం, అంతర్జాతీయంగా ధరలు పుంజుకున్నాయి. మరోసారి వరుస ర్యాలీ ఉండనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలతో పాటుగానే వెండి ధరలు కూడా భారత్ లో అంతర్జాతీయ మార్కెట్లోనూ ఎగబాకాయి.
ప్రస్తుతం హైదరాబాద్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరిగింది. దీంతో తులం రూ. 72,400కు చేరుకుంది. దీనికి ముందు రోజు రూ. 150 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 78,960వద్ద ట్రడేవుతోంది. దేశ రాధాని ఢిల్లీలోనైూ ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం కిలో వెండి ధర 91,662గా ఉంది. ఢిల్లీలోనూ ఇవే ధరలు ఉన్నాయి. కేజీ సిల్వర్ ధర లక్ష చేరువలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఔన్సుకు 2851 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. స్పాట్ సిల్వర్ ధర 30.66 డాలర్లు ఉంది. రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 84,56 దగ్గర ఉంది.