Gold Rate Today: త్వరలోనే బంగారం ధర రూ.30వేలకు పడిపోనుందా.. నేడు సోమవారం డిసెంబర్ 2 పసిడి ధర ఎలా ఉందంటే..?

Update: 2024-12-02 01:21 GMT

Gold and Silver Rates Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి కాస్త ఊరట లభించింది. వీటి ధరలు స్వల్పంగా తగ్గాయి. త్వరలోనే బంగారం ధర రూ. 30వేలకు పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ధరలు ఏ మేరకు తగ్గాయో తెలుసుకుందాం.

బంగారం, వెండి కొనుగోలు చేయాలని ప్లాన్ చేసే పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్నాళ్లుగా భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు నేడు కాస్త తగ్గాయి. ప్రధానంగా పండగల సీజన్ లో ఈ ధరలు విపరీతంగా పెరిగాయి. దీపావళి నుంచి బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారంతో పోల్చితే వీటి ధరలు తగ్గాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గింది. వెండి కిలోకు రూ.100 రూపాయలు తగ్గింది.

కాగా బంగారం ధరలు పెరగడానికి తగ్గడానికి ప్రధనంగా దోహదం చేసేవి మార్కెట్లో డిమాండ్, ప్రపంచ ఆర్థక పరిస్థితులతోపాటు డాలర్ విలువ కూడా బంగారం ధరను నిర్ణయిస్తుంటాయి. డాలర్ విలువ బలపడితే బంగారం ధర తగ్గుతుంది. బంగారం ధర తగ్గడానికి మాత్రం ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే పదవీ బాధ్యతలు చేపడతారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. దీనికి ప్రధాన కారణంగా డొనాల్డ్ ట్రంప్ వ్యాపార అనుకూల వైఖరి విధానంతో అమెరికాలో పెట్టుబడులు పెద్దెత్తున ఆహ్వానించే ఛాన్స్ ఉంది. తద్వారా స్టాక్ మార్కెట్లో మళ్లీ లాభాలు పడతాయి. ఫలితంగా బంగారంపై పెట్టుబడులు భారీగా తగ్గే అవకాశం ఉంది.

బంగారం ధరలు ప్రస్తుతం 77వేలకు సమీపంలో ఉన్నాయి. అయితే గతంతో పోల్చితే బంగారం ధర 84వేల రూపాయల దగ్గర అత్యంత గరిష్ట స్థాయిని తాకింది. అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 77వేలకు చేరుకుంది. భవిష్యత్తులో బంగారం ధర మరింత దిగివచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

బంగారం కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయమా కాదా అని చాలా మంది అనుకుంటున్నారు. నిజానికి బంగారంపై పెట్టుబడి అనేది ఎప్పటికీ అనుకూలమనదే అని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారంప పెట్టుబడి పెట్టిన దాని ధర పెరుగుదలకు అనేక రకాల అవకాశా ఉంటాయి. ముఖ్యంగా బంగారం ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ తో అనుసంధానమై ఉంటుంది. అయితే ఆభరణాలు కొనుగోలు చేసే వారు మాత్రం బంగారం ధర తక్కువగా నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఫిజికల్ బంగారం కంటే ఇతర పద్ధుతుల ద్వారానే పెట్టుబడి పెడితే లాభం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే గోల్డ్ బాండ్ స్కీములలో పెట్టుబి పెట్టడం ద్వారా మరింత వడ్డీ కూడా లభిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు మీ పెట్టుబడి కూడా సురక్షితంగా ఉంటుంది.

Tags:    

Similar News