Bank holidays in December: బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్..డిసెంబర్ 17రోజులు బ్యాంకులు బంద్..జాబితా ఇదే

Update: 2024-11-29 04:30 GMT

Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్..ఏపీ, తెలంగాణలో మూడు రోజులు బ్యాంకులు బంద్

Bank holidays in December: రేపటి (శనివారం)తో నవంబర్ నెల ముగుస్తుంది. డిసెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో రాబోయే డిసెంబర్ నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేస్తాయి..ఏయే రోజుల్లో మూతపడతాయి వివరాలతో డిసెంబర్ బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను చూద్దాం.

సంవత్సరం చివరి నెలలో అంటే డిసెంబర్‌లో చాలా సెలవులు ఉండబోతున్నాయి. డిసెంబర్‌లో మొత్తం 17 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. పండుగలు, ప్రాంతీయ, జాతీయ సెలవులు కాకుండా, డిసెంబర్‌లో మొత్తం 5 ఆదివారాలు, 2 శనివారాలు బ్యాంకులు మూసిఉంటాయి. భారతదేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతాయి. మీరు బ్యాంకు నుండి ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయాల్సి వస్తే, ఖచ్చితంగా సెలవుల జాబితాను ఓసారి చెక్ చేసుకోవాలి.

అయితే చాలా వరకు బ్యాంకింగ్ పనులు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే జరుగుతాయి. కానీ నేటికీ పలు రకాల లోన్స్ తీసుకోవడం వంటి అనేక పనుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. అయితే వచ్చేనెల డిసెంబర్ నెలలో బ్యాంకులు ఏయో తేదీల్లో మూతపడి ఉంటాయో చూద్దాం.

- డిసెంబర్ 1వ తేదీ ఆదివారం వారపు సెలవు కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.

- సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ రోజున డిసెంబర్ 3 (శుక్రవారం) గోవాలో బ్యాంకులు బంద్ ఉంటాయి.

- ఆదివారం కారణంగా డిసెంబర్ 8న దేశంలోని అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.

- ప-టోగన్ నెంగ్మింజా సంగ్మా సందర్భంగా డిసెంబర్ 12న (మంగళవారం) మేఘాలయలో బ్యాంకులు బంద్

-డిసెంబర్ 14వ తేదీ (శనివారం) రెండో శనివారం కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులు బంద్

-డిసెంబర్ 15 ఆదివారం కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.

-యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 18 (బుధవారం) మేఘాలయలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

-గోవా విమోచన దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 19 (గురువారం) గోవాలో బ్యాంకులకు సెలవు

-డిసెంబర్ 22 ఆదివారం కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలువు

-డిసెంబర్ 24 (గురువారం) క్రిస్మస్ పండుగ సందర్భంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయలో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.

-క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న (బుధవారం) దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

-క్రిస్మస్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 26న (గురువారం) మిజోరాం, నాగాలాండ్, మేఘాలయలో బ్యాంకులు బంద్ ఉంటాయి.

-క్రిస్మస్ వేడుకల కారణంగా డిసెంబర్ 27 (శుక్రవారం) నాగాలాండ్‌లో బ్యాంకులకు సెలవు

-డిసెంబర్ 28 (శనివారం) నాల్గవ శనివారం కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు

-డిసెంబర్ 29 ఆదివారం కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

-U Kiang Nangbah సందర్భంగా డిసెంబర్ 30 (సోమవారం) మేఘాలయలో బ్యాంకులు మూసి ఉంటాయి.

-డిసెంబర్ 31న (మంగళవారం) నూతన సంవత్సర పండుగ/లోసాంగ్/నామ్‌సాంగ్ సందర్భంగా మిజోరం, సిక్కింలో బ్యాంకులు మూసి ఉంటాయి.

Tags:    

Similar News