Gold Rates Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..తులంపై ఎంత పెరిగిందంటే?
Gold Rates Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. బంగారం బాటలోనే వెండి కూడా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం తులం బంగారం ధర రూ. 700 వృద్ధితో 10 గ్రాముల బంగారం ధర రూ. 79,400 పలికింది.
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులతో పసిడి ప్రియులను ఆందోళనలో నెట్టేస్తున్నాయి. ఒకరోజు ధర పెరిగితే..మరో రోజు తగ్గుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం తులం బంగారం ధర రూ. 700 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 79,400 పలికింది. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయంగా స్థానిక జువెల్లరీల నుంచి తాజా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బంగారం ధర భారీగా పెరిగింది.
99.5 శాతం స్వచ్చత గత పసిడి తులం ధర రూ. 700 పెరిగి రూ. 79వేలు పలికింది. గురువారం తులం బంగారం ధర రూ. 78,700 వద్ధ స్థిరంగా ఉంది. గురువారం 99.5శాతం స్వచ్చత గత బంగారం ధర తులం రూ. 78,300 పలికింది. శుక్రవారం కిలో వెండి ధర రూ. 1,300 పెరుగుదలతో రూ. 92,200 వద్ద నిలిచింది. గురువారం రూ. 4,900 పతనం అయి రూ. 90,900లకు పరిమితం అయ్యింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో డిసెంబర్ డెలివరీ గోల్డ్ రేట్ ధర రూ. 602 పెరిగింది రూ. 76,326కు చేరుకుంది. కిలో వెండి కాంట్రాక్టస్ డిసెంబర్ డెలివరీ ధర రూ. 1,049 పుంజుకుని రూ. 89, 051లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ బంగారం ఔన్స్ ధర రూ. 20. 60డాలర్ల పెరుగుదలతో 2,685డాలర్లకు చేరింది. ఔన్స్ వెండి ధర 1.94 శాతం పెరిగి 31.15డాలర్లు పలికింది. పెట్టుబడి దారులు వచ్చే వారం అమెరికా ఫెడ్ రిజర్వ్ సమీక్షపై ఫోకస్ పెట్టారని అబాన్స్ హోల్డింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా తెలిపారు.