రోజుకు జస్ట్ రూ.10 పొదుపు చేస్తే మీరే కోటీశ్వరులు.. ఇంతకీ ఎక్కడ చేయాలంటే..?
SIP: ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత ఆదా చేయాలని చూస్తారు. ఇప్పటి నుంచే కాస్త కూడబెట్టుకుంటే పదవీ విరమణ సమయంలో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయని భావిస్తారు.
SIP: ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత ఆదా చేయాలని చూస్తారు. ఇప్పటి నుంచే కాస్త కూడబెట్టుకుంటే పదవీ విరమణ సమయంలో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయని భావిస్తారు. అలా చిన్నప్పటి నుంచే పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచన. అప్పటి నుంచే పొదుపును అలవర్చుకోవాలి. దీనికి చాలా ఆప్షన్లు ఉన్నాయి. కానీ వాటన్నింటిలో మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ సంపద ఊహించని రీతిలో పెరుగుతుంది. ఇక్కడ తొలినాళ్లలో పెద్దగా ప్రయోజనం కనిపించదు కానీ.. ఏళ్లు గడుస్తున్నా కొద్ది పెట్టుబడిపై చక్రవడ్డీ రూపంలో భారీ మొత్తం జమ అవుతుంది.
మ్యూచువల్ ఫండ్లలో ఏకమొత్తంగా ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. లేదా మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. వీటిలో సగటు వార్షిక ప్రాతిపదికన 15 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చిన అనేక స్కీంలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రాబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుని ఇన్వెస్ట్ చేయడం వల్ల కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చు. మంచి పథకాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం గతంలో మంచి రాబడినిచ్చిన పథకాలపై అవగాహన పెంచుకోవాలి.
ఇన్వెస్ట్ మెంట్ కు ప్రధాన వనరు స్టాక్ మార్కెట్. దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే ఊహించని రాబడిని ఇస్తుంది. అదే విధంగా కొందరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నారు. మీరు సిప్ ద్వారా ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందవచ్చు. మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే? ప్రతి నెలా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బు పెట్టడం ద్వారా దీర్ఘకాలం వెయిట్ చేస్తే సరిపోతుంది. సిప్ భారీ సంపదను సృష్టించడంలో దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సాయపడుతుంది. మీ స్థోమతను బట్టి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.
రోజుకు కనీసంలో కనీసం రూ.10లు ఆదా చేయడం ద్వారా కూడా మీరు కోటీశ్వరులు కావచ్చు. మీరు సిప్ లో రోజుకు రూ.10లు అంటే నెలకు రూ.300లు పెట్టుబడి పెట్టాలి. కేవలం రూ. 300తో సిప్ ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలంలో 15 నుంచి 20 శాతం రాబడి వస్తుందని గత నివేదికలు స్పష్టం చేశాయి. 40 ఏళ్లపాటు పెట్టుబడికి నెలకు రూ. 300 చొప్పున 1.44లక్షల నిధి సమకూరుతుంది. మీరు 40 ఏళ్లపాటు ఇలా ఇన్వెస్ట్ చేయాలి. అది 15 శాతం తిరిగి ఇస్తే మీ ఫండ్ అక్షరాలా రూ. 94,21,127అవుతుంది. మీ పెట్టుబడి రూ.1.44లక్షలు అయితే రాబడి రూ. 92,77,127అవుతుంది. అప్పుడు మీ మొత్తం డబ్బు రూ. 94,21,127 అవుతుంది. సిప్ ల నుండి వచ్చే రాబడులు పెట్టుబడి వ్యవధి, ఆశించిన ఫండ్, పెట్టుబడి మొత్తం, రాబడి శాతం అనే నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటాయి. మొదటి మూడు అంశాలను అమలు చేయడం పెట్టుబడిదారుడి ఇష్టం. కానీ పర్సంటేజీ రాబడి అనేది మాత్రం ఎవరి చేతుల్లో ఉండదు. ఇది మార్కెట్ పరిస్థితులను బట్టి మారిపోతుంది.