Gold Rate Today: పసిడి ప్రియులకు అదిరిపోయే వార్త..తగ్గిన బంగారం ధర..వెండి ధర ఎంతుందంటే ?
Gold Rate Today: బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దీపావళి దసరా ఫెస్టివల్ ముగిసిన సందర్భంగా నగల దుకాణాల్లో కొద్దిగా సందడి తగ్గింది. నవంబర్ 4వ తేదీ సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,850 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,100 రూపాయాలుగా ఉంది. బంగారం ధరలు ఇప్పటికీ కూడా ఆల్ టైం రికార్డ్ స్థాయికి సమీపంలోనే ఉంటున్నాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణము బంగారం నుంచి లాభాలను స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు ట్రై చేయడమే ఒక కారణంగా చెబుతున్నారు.
గత కొన్ని వారాలుగా బంగారం ధర కంటిన్యూగా పెరుగుతూనే ఉంది. ఈ రేంజ్ లో కొద్దిగా రిలీఫ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను తగ్గించి లాభాలను స్వీకరించే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో బంగారం ధరలు కొద్దిగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. అయితే భవిష్యత్తులో మాత్రం బంగారం ధర పెరిగే అవకాశం ఉందని 2025 సంవత్సరం నాటికి ఒక లక్ష రూపాయలు దాకే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెలకొన్న సందిగ్ధత అని చెప్తున్నారు. అయితే బంగారం ధరలు భవిష్యత్తులో భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే బంగారం పై పెట్టుబడి పెడతారో వారికి మాత్రం లాభాలు అందించే అవకాశం ఉందని చెప్తున్నారు. . అయితే బంగారం పై పెట్టుబడి పెట్టే వారికి సరైన పద్ధతి ఫిజికల్ బంగారం కొనుగోలు చేయడం కాదని మాత్రం సూచిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీం వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుందని, నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎవరైతే ఆభరణాల కోసం బంగారం కొనుగోలు చేస్తారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలని, ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో హాల్ మార్క్ విషయంలో కచ్చితంగా ఉండాలని సూచిస్తున్నారు.