Gold Rate Today: వరుసగా తగ్గుతున్న బంగారం ధర..పసిడి ప్రియుల ముఖాల్లో ఆనందం..నేడు ఎంత తగ్గిదంటే?

Update: 2024-11-06 00:35 GMT

Gold Rates Today: నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. బంగారం ధరలు మరోసారి 81 వేల మార్కును దాటాయి. నవంబర్ 6 బుధవారం బంగారం ఇలా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర .81,070 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,350 రూపాయలుగా ఉంది.

బంగారం ధరలు ఇప్పటికీ కూడా ఆల్ టైం రికార్డ్ స్థాయి సమీపంలోనే ట్రేడ్ అవుతున్నాయి. అయితే గడిచిన కొన్ని రోజులుగా కాస్త హెచ్చుతగ్గులకు లోన్ అవుతున్నాయి అయితే బంగారం ధరలో గతంతో పోల్చి చూసినట్లయితే, ధర పెరుగుదలలో వేగం తగ్గింది. దీనికి ప్రధాన కారణం ఫెస్టివల్ సీజన్ లో బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

దసరా దీపావళి ఫెస్టివల్ సీజన్ ముగిసింది. దీంతో పసిడి ప్రియులు బంగారం కొనుగోలు పైన ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే బంగారం ధరలో భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికలు అని చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అమెరికా ఎన్నికల్లో రాజకీయ అనిశ్చితి ఏర్పడితే దాని ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఎక్కువగా ఉంటుంది.

అప్పుడు ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి బంగారం వైపు తరలించే అవకాశం ఉంటుంది. ఫలితంగా బంగారం ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంటుంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే పసిడి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో, అలాంటివారు ఫిజికల్ బంగారం కొనుగోలు చేస్తే మంచిది లేక బాండ్ల రూపంలో బంగారం కొనుగోలు చేస్తే మంచిదా అని ఆలోచించడం సహజం.

ఫిజికల్ రూపంలో బంగారం కొనుగోలు చేయడం అనేది రిస్క్ తో కూడిన పని, ఆభరణాల అవసరం ఉండే తప్ప బంగారం కొనుగోలు చేయడం వల్ల మీకు పెద్దగా లాభం ఉండక పోవచ్చు. ఆభరణాలు బంగారం కొనుగోలు చేసినప్పుడు అందులో తరుగు మజూరి .జీఎస్టి వంటి ఇతర చార్జీలు యాడ్ అవుతాయి. 24 క్యారెట్ల బంగారం బిస్కెట్లు, కాయన్స్, కడ్డీల రూపంలో కొనుగోలు చేయాలి.

అయితే వీటిని తిరిగి కోవడం అనేది ఇబ్బందితోకూడిన పని. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో రాబడి పొందడం సులభం అవుతుందని నిపుణులు సూచిేస్తున్నారు.

Tags:    

Similar News