Gold Rate Today: వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. మహిళలకు పండగే.. తులం పసిడి ధర ఎంత తగ్గిందంటే..?

Update: 2024-11-05 01:00 GMT

Gold Rate Today: బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. నేడు నవంబర్ 5వ తేదీ మంగళవారం కూడా బంగారం ధర భారీగా తగ్గింది. నిన్నటితో పోసి చూసినట్టయితే బంగారం ధర 150 రూపాయలు తగ్గింది. తాజా బంగారం ధరలు పరిశీలిస్తే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80400 రూపాయలు పలికింది. 22 గంటల 10 గ్రాముల బంగారం ధర 73700 రూపాయలు పలికింది.

పసిడి ధరలు వరుసగా మూడు రోజులుగా తగ్గుతున్నాయి. దీని వెనుక కారణాల విషయానికొస్తే బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా బంగారం తగ్గుముఖం పట్టడం ఒక కారణం అనేది గమనించవచ్చు. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పసిడి మార్కెట్లో పెట్టుబడి పెట్టినవారు లాభాలను స్వీకరిస్తున్నారు ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణంగా చెప్తున్నారు.

అయితే ప్రస్తుతం తగ్గుతున్న బంగారం ధరలు స్వల్ప కాలం రిలీఫ్ మాత్రమేనని అనలిస్టులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక కారణంగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం చైనా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో, ప్రస్తుతం ఆసియా స్టాక్ మార్కెట్లలో ఊపు లభించే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా చైనా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టేవారు నెమ్మదిగా చైనా మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. దీంతో అటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంటుంది.

అయితే అటు అమెరికాలో మార్కెట్లలో అనిశ్చితి, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు సమసిపోయే వరకూ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే 2025 సంవత్సరంలో మాత్రం బంగారం ధర ఇదే రేంజ్ లో పెరిగినట్లయితే లక్ష రూపాయలు దాటడం ఖాయమని కూడా నిపుణులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News