Business Idea: సిరులు కురిపించే వ్యాపారం.. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే లాభాలు..!
Business Idea: వ్యాపారం చేయాలనే ఆలోచన ఎక్కువుతోంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఎక్కువుతున్నారు.
Business Idea: వ్యాపారం చేయాలనే ఆలోచన ఎక్కువుతోంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఎక్కువుతున్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బిజినెస్ చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. మీరు కూడా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారా.? తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందాలని అనుకుంటున్నారా.? అయితే ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.
ముత్యాల సాగుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. సాధారణంగా ఈ వ్యాపారాన్ని చాలా తక్కువగా చేస్తుంటారు. మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ముత్యాల తయారీ లేదు. అందుకే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు. ఇంతకీ ముత్యాలను ఎలా తయారు చేస్తారు.? అలాగే ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి ఎంత పెట్టుబడి కావాలి.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ముత్యాలను చలికాలంలో సాగు చేస్తుంటారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే నీటి కొలనును ఏర్పాటు చేసుకోవాలి. కనీసం 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొలనును నిర్మించుకోవాలి. ఇక ముత్యాలు ఆయిస్టర్ల నుంచి లభిస్తాయనే విషయం తెలిసిందే. ఒక్కో ఆయిస్టర్ నుంచి ఒక ముత్యం లభిస్తుంది. ఒక్కో ఆయిస్టర్ ధర రూ. 15 నుంచి రూ. 25 ఉంటాయి.
ఇక లాభాల విషయానికొస్తే.. మార్కెట్లో ఒక్కో ముత్యం నాణ్యత బట్టి రూ. 300 నుంచి రూ. 1500 వరకు ఉంటాయి. నాణ్యత ఎక్కువగా ఉన్న ముత్యం అయితే ఏకంగా రూ. 10 వేల వరకు కూడా పలుకుతాయి. తక్కువలో తక్కువ ఒక్కో ముత్యాన్ని రూ. 1000 అయినా విక్రయించుకోవచ్చు. పెద్ద ఎత్తున ఆయిస్టర్లను కొనుగోలు చేస్తే నెలకు రూ. లక్ష వరకు ఆదాయాన్ని పొందొచ్చు.