ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్.. పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ..!
MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ లో చేసిన పోస్ట్ దుమారం రేగుతుంది. ఎన్డీయే నేతల మధ్య గొడవ పెట్టేలా విజయ సాయి ట్వీట్ చేశారు.
MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ లో చేసిన పోస్ట్ దుమారం రేగుతుంది. ఎన్డీయే నేతల మధ్య గొడవ పెట్టేలా విజయ సాయి ట్వీట్ చేశారు. ఏపీకి పవన్ కల్యాణ్ నాయకత్వం వహించాలని యంగ్ ఏపీని యంగ్ లీడర్ అయితేనే సమర్థవంతంగా లీడ్ చేయగలరన్నారు. వయస్సు, దేశవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఏపీకి పవన్ కల్యాణ్ నాయకత్వం వహించాలన్నారు. 75 ఏళ్ల వయస్సులో సమర్థవంతంగా చంద్రబాబు పనిచేయలేరన్నారు.
కాకినాడ పోర్టు విషయంలో విచారణ చేపట్టకుండానే లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడంపై ఫిర్యాదు చేస్తానన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అన్యాయం జరిగితే నాలుగున్నరేళ్ల నుంచి కేవీ రావు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు రాగానే ఫిర్యాదు చేయడం వెనక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. కేవీ రావు చంద్రబాబు మనిషని ఆక్షేపించారు. 2020మేలో కేవీరావుకు ఫోన్ చేశానని... కాకినాడ పోర్టుపై విక్రాంత్‌తో మాట్లాడానని చెప్పేందుకు ఆధారాలున్నాయా అని అడిగారు విజయసాయి రెడ్డి.