Andhra Pradesh: ఇవాళ వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Andhra Pradesh: మ.3గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన భేటీ

Update: 2021-11-26 03:42 GMT
వైసీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పార్టీ ఎంపీలతో సీఎం జగన్ నేడు సమావేశం కానున్నారు. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో సీఎం జగన్ చర్చించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నేడు ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో వరద బీభత్సం తీవ్రంగా ఉంది. ఆస్తి నష్టం కూడా తీవ్ర స్థాయిలో ఉంది. సుమారు ఐదు వేల కోట్లకు పైగా నష్టం వచ్చిందని కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారు. తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు ప్రకటించాలని కోరారు. అవసరం అయితే పార్లమెంట్‌లో కూడా ఈ అంశం ప్రస్తావించాలని జగన్ ఎంపిలకు దిశానిర్దేశం చేయనున్నారు

రాష్ట్ర ప్రయోజనాలను సంబంధించిన అంశాలను ప్రధాన అజెండాగా వైసీపీ పార్లమెంట్‌లో లెవనెత్తనుంది. పోలవరం ప్రాజెక్టు నిధులు, పెండింగ్ బకాయిల విడుదల వంటి అంశాలతో పాటు ప్రత్యేక హోదా పైనా కేంద్రాన్ని అడగానున్నారు వైసీపీ ఎంపీలు. అంతేకాకుండా జిఎస్టీ బకాయిల గురించి కేంద్రాన్ని కోరనున్నారు. వీటితో పాటు మూడు రాజధానులు అంశం, కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రాన్ని అడగనున్నారు. ఇప్పటికే ఈ అంశాలపై సీఎం జగన్ కేంద్ర పెద్దలను కలిసి కోరారని ఇప్పుడు మరోసారి పార్లమెంట్ వేదికగా ఈ అంశాలను లేవనెత్తనున్నారు వైసీపీ ఎంపీలు..

ఇప్పటికే మూడు రాజధానులు బిల్‌ను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో వెనక్కి తీసుకుంది. కొత్త రాజధానికి సంబంధించి కేంద్ర నిర్ణయం కూడా ముఖ్యమే. రాష్ట్ర విభజన సమస్యలు, షెడ్యూల్ 9, 10లో ఆస్తుల విభజన, రెవెన్యూ లోటు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై పార్లమెంట్‌లో చర్చించే విధంగా దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.

Full View


Tags:    

Similar News