విశాఖ గ్యాస్ లీకేజ్: భయానక పరిస్థితికి కారణమైన గ్యాస్ వివరాలివే
ముగ్గురు మరణించారు.. ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇబ్బందికర వాతావరణం. మూడు కిలోమీటర్ల పరిధిలో భయానక పరిస్థితి.
ముగ్గురు మరణించారు.. ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇబ్బందికర వాతావరణం. మూడు కిలోమీటర్ల పరిధిలో భయానక పరిస్థితి. ఇదీ విశాఖపట్నం గోపాల పట్నం ప్రాంతంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి ఈ తెల్లవారుజామున లీకైన గ్యాస్ తో ఏర్పడ్డ తీవ్రమైన పరిస్థితి.
అసలు విశాఖలో లీకైన గ్యాస్ ఏమిటి? ఇంత భయానక గ్యాస్ తో అక్కడ ఆ కంపెనీ ఎందుకు నడుస్తోంది? అసలు ఆ కంపెనీ అక్కడ చేసే ఉత్పత్తులేమిటి?
పలువురు నిపుణులు చెబుతున్న దాని ప్రకారం విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ లో ప్రధానంగా polystyrene ఉత్పత్తి అవుతుంది. ఈ polystyrene
తాయారు చేయడానికి styrene అనబడే ముడి పదార్ధం వాడతారు దీనిని కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఈ styrene గ్యాస్ లీకయింది.
ఈ గ్యాస్ వల్ల తొలుతగా తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్ళు మంటలు, వస్తాయి, ఇదే గ్యాస్ ను ఎక్కువగా పిలిస్తే క్యాన్సర్, కిడ్నీ వంటి వ్యాధులతో బాధ పడే అవకాశం ఉంది.
కంపెనీ పూర్వాపరాలివే..
ఎల్జి పాలిమర్స్ 1997 లో ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో నెలకొల్పబడింది, 213 ఎకరాల విస్తీర్ణంలో 168 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయం తో ఈ సంస్థ ప్రారంభమైంది, ఈ కంపెనీ ప్రతిరోజు 417 టన్నుల polystyrene ను ఉత్పత్తి చేస్తుంది, గతంలో కూడా ఈ ఎల్ జి పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీక్ వచ్చినప్పటికీ కంపెనీ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై వాటిని అరికట్టే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ..