Vijayawada: శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. విజయదశమి సందర్భంగా అమ్మవారు ఈ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
చెరుకుగడను వామహస్తముతో ధరించి, దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీచక్రరాజ దేవతగా వెలుగొందే తల్లి శ్రీరాజరాజేశ్వరిదేవి. ఈ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపచేసే అపరాజితాదేవిగా, చల్లనితల్లిగా శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనం ఇస్తుంది.