Vasantha Krishna Prasad: పాత తరం నాయకుడిగా మిగిలిపోయా
Vasantha Krishna Prasad: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు
Vasantha Krishna Prasad: అధికార వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 10 మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతగాక తాను పాత తరం నాయకుడిగానే మిగిలిపోయానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయం చేస్తోందని తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లోనే ఉన్నారన్నారు. తాను కొంతమందిని వెంటేసుకుని రాజకీయాలు చేయనని, అలా చేయగలిగితేనే నేటి రాజకీయాల్లో నిలబడగలమని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.