Vangaveeti Radha Marriage: ఈ నెల 22 న వంగవీటి రాధా వివాహం
Vangaveeti Radha Marriage: జక్కంపూడి బాబ్జీ కుమార్తె పుష్పవల్లితో ఇటీవల నిశ్చితార్థం
Vangaveeti Radha Marriage: వంగవీటి రాధాకృష్ణ వివాహ ముహూర్తం ఫిక్స్ అయింది. మరో 14 రోజుల్లో అంటే అక్టోబర్ 22వ తేదీ ఆదివారం రాత్రి 7.59 నిమిషాలకు వివాహం జరగనుంది. జక్కంపూడి బాబ్జీ కుమార్తె పుష్పవల్లితో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. రాజకీయ ప్రముఖులతో పాటుగా అభిమాన గణం పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో కళ్యాణ వేదికను అందుకు అనుగుణంగా ఖరారు చేశారు. విజయవాడ - నిడమానూరు పోరంకి రోడ్డు లోని మురళి రిసార్ట్స్‌లో వివాహం జరగనుంది.