రెండు టన్నుల చేపల మృతి.. గ్రామస్థుల విచారం

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం భైరసముద్రం చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. గత నెలలో కురిసిన వర్షాలకు చెరువులోకి భారీగా నీరు చేరడంతో ఆ ప్రాంత రైతులు అందులో చేప పిల్లలు వదిలారు. అయితే తే.గీ చేపపిల్ల ప్రస్తుతం 300 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు పెరిగాయి..

Update: 2020-06-26 15:52 GMT

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం భైరసముద్రం చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. గత నెలలో కురిసిన వర్షాలకు చెరువులోకి భారీగా నీరు చేరడంతో ఆ ప్రాంత రైతులు అందులో చేప పిల్లలు వదిలారు. అయితే తే.గీ చేపపిల్ల ప్రస్తుతం 300 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు పెరిగాయి.. అవి ఆ చెరువులో వేలాదిగా ఉన్నాయి. అయితే అవి ఉన్నట్టుండి నీటిపై తేలుతూ ఒడ్డుకు కొట్టుకు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. బ్రహ్మసముద్రం తహసిల్దార్ ఎంపీడీవో చెరువు ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోలీసులకు సమాచారం అందించి చేపల మృతికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేయాలనీ కోరారు. మృతిచెందిన చేపలను చూడటానికి పెద్ద ఎత్తున గ్రామస్థులు ఆ చెరువు వద్దకు వచ్చారు.

అయితే ఇందులో కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. చెరువులో ఎవరైనా విషం కలిపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చేపల మృతికి కారణాలు చెప్పాలని రైతులు కోరుతున్నారు. ఇదిలావుంటే మృతిచెందిన చేపలు దాదాపు రెండు టన్నులు ఉండే అవకాశం ఉన్నట్టు గ్రామస్థులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గత పది సంవత్సరాల తరువాత భైరసముద్రం చెరువు పూర్తిస్థాయిలో నిండిందని దాంతో ఎంతో ఆశతో చేప పిల్లలు వదిలితే అవి మృతిచెందడం బాధాకరమని గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు. 


Tags:    

Similar News