RGV: రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Ram Gopal Varma: సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 27కు వాయిదా వేసింది.

Update: 2024-11-26 06:23 GMT

Ram Gopal Varma: ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరో పిటిషన్

Ram Gopal Varma: సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 27కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,మంత్రి లోకేష్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ టీడీపీ, జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలు, గుంటూరు , విశాఖపట్టణం జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.

ఒంగోలు కేసులో విచారణకు హాజరుకావాలని వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల విచారణకు ఆయన హాజరుకాలేదు. వర్మ కోసం ఒంగోలు పోలీసులు హైద్రాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. షూటింగ్ కోసం ఆయన ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్టుగా పోలీసులకు ఆయన ఇంట్లో పనిచేసే సిబ్బంది సమాచారం ఇచ్చారు. వర్మ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ తరుణంలోనే విశాఖపట్టణం, గుంటూరులలో కేసులకు సంబంధించి వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

Tags:    

Similar News