APSRTC: హైదరాబాద్‌లోని ఏపీ వాసులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. సంక్రాంతికి 2,400 స్పెషల్ బస్సులు

APSRTC: హైదరాబాద్‌లోని ఏపీ వాసులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.

Update: 2024-12-28 09:33 GMT

APSRTC: హైదరాబాద్‌లోని ఏపీ వాసులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. సంక్రాంతికి 2,400 స్పెషల్ బస్సులు

APSRTC: హైదరాబాద్‌లోని ఏపీ వాసులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జనవరి 9 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు మొత్తం 2,400 స్పెషల్ బస్సులను నడపనున్నట్టు తెలిపింది.

ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించవచ్చని ఏపీఎస్‌ఆర్టీసీ వివరించింది. పండుగ వేళ ప్రజలపై ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, మాచర్లతో పాటు వేర్వేరు ప్రదేశాలకు వెళ్లే సాధారణ బస్సులు, స్పెషల్ బస్సులు హైదరాబాద్ నగరంలోని సీబీఎస్ నుంచి బయలుదేరుతాయని అధికారులు తెలిపారు.

ఏపీలో సంక్రాంతి పండుగను బాగా జరుపుకుంటారు. ముఖ్యంగా అక్కడి కోడి పందెలు అందర్నీ ఆకట్టుకుంటాయి. అయితే సొంత గ్రామాలకు వెళ్లే వారు కొందరైతే.. మరికొందరు కోడి పందేలు చూడడానికి వెళ్తుంటారు. దీంతో బస్సులు రద్దీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News