AP weather updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో 1.5 కిలోమీటర్ల ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా తీరం వెంట గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ పరిస్థితులతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
మరో వైపు తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం కన్పిస్తోంది.రెండు రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వచ్చే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందన వృద్దులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.