Rain Alert: తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. మరింత పెరగనున్న చలి
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాలను ముసురు వదడంలేదు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగానే ఉంటుందని పేర్కొంది.దీని ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయి తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
నెల్లూరుతోపాటు పలు జిల్లాలకు భారీ వర్షాలు పొంచిఉన్నట్లు వెల్లడించింది. గంటకు 65కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని పోర్టులకు వాతావరణశాఖ మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని పేర్కొంది. మరోవైపు తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపనున్నట్లు తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ లో పలు చోట్ల చిరుజల్లులు పడుతుండగా..రాబోయే నాలుగు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో చలి తీవ్రత మరికాస్త పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. తూర్పు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు శీతల గాలులు వీస్తాయని, దీంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు నుంచి చలిగాలుల తీవ్ర పెరిగే ఛాన్స్ ఉందని..జనవరి 2వ వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది.