Nara Lokesh: గౌతం అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవడం కష్టమే.. ఎందుకంటే..
Nara Lokesh About Gautam Adani Cancelling Power Agreements: గౌతం అదానీ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని అమెరికా కోర్టు చేసిన ఆరోపణలు దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల తరువాత అదానీతో పలువురు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అమెరికా ఆరోపణల్లో ఆంధ్రప్రదేశ్ పేరే ఎక్కువగా హైలైట్ అయింది.
2019-24 మధ్య ఏపీకి చెందిన బడా బాబుకే రూ. 1750 కోట్లు లంచంగా ఇచ్చారనేది అమెరికా కోర్టు చేసిన ప్రధానమైన ఆరోపణల్లో ఒకటి. దీంతో అదానీతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా ఇదే విషయమై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వ హయాంలో అదాని పవర్ నుండి సోలార్ పవర్ కొనుగోలు విషయంలో సెకితో ( సోలార్ ఎనర్జి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చేసుకున్న ఒప్పందాలను పరిశీలిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. అదానితో ఒప్పందాలను రద్దు చేయడం కుదరదన్నారు. ఇప్పుడు తొందరపడి ఒప్పందాలు రద్దు చేసుకుంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మంత్రి నారా లోకేష్ చెప్పినట్లుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.
US Allegations Against Gautam Adani: అదానీపై అమెరికా చేసిన ఆరోపణలేంటి? వాటితో ఏపీకి లింకేంటి? ఈ వీడియోలో చూడండి.