Rain Alert: నేడు తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం..మూడు రోజులపాటు భారీ వర్షాలు
AP Rain Alert: నేడు బంగాళాఖాతంలో ఏర్పాడిన వాయుగుండం తీవ్ర తుపాన్ గా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Rain Alert: సాధారణంగా వర్షాకాలంలోనే వర్షాలు భారీగా కురుస్తుంటాయి. లేదంటే నవంబర్ లో కురుస్తుంటాయి. కానీ చలికాలంలోనూ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే నేడు బంగాళాఖాతంలో ఏర్పాడిన వాయుగుండం తీవ్ర తుపాన్ గా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.
నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. దీంతో నేడు అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది గంటకు 8కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది. ఉత్తర, వాయువ్య దిశగా కదులుతోంది. నేడు తుపానుగా మారుతూ 2 రోజుల్లో తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
దీంతో నేడు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నవంబర్ 28, 29, 30 తేదీల్లో కురుస్తాయని అంచనా వేసింది. కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో నేటి నుంచి డిసెంబర్ 1 వరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. డిసెంబర్ 1వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడమే మంచిదని అధికారులు తెలిపారు.
అయితే తెలంగాణకు మాత్రం వర్ష సూచన లేదని ఐఎండీ తెలిపింది. ఏపీలో కోస్తాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర వరకు తేమ 50శాతమే ఉంది. అందువల్ల నేడు వర్షాలు కురిసే అవకాశం తక్కువ. రాయలసీమలో మాత్రం 60 శాతం వరకు ఉండటంతో నేడు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.