School Holidays: భారీ నుంచి అతి భారీ వర్షాలు..స్కూళ్ల కు సెలువులు?

School Holidays: ఫెంగల్ తుపాను దృష్ట్యా ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యినట్లు కనిపించడం లేదు.

Update: 2024-11-27 03:00 GMT

School Holidays: భారీ నుంచి అతి భారీ వర్షాలు..స్కూళ్ల కు సెలువులు?

School Holidays: ఫెంగల్ తుపాను దృష్ట్యా ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా ముందుస్తు చర్యలు ఏవీ కనిపించడం లేదు. కానీ ఈ తుపాన్ ప్రభావం భారీగానే ఉండేలా కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. దీంతో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీ లోని రాయలసీమ, కోస్తాంధ్రపై ఎఫెక్ట్ కనిపించబోతోంది. దీని వేగం సుడి అన్నీ బలంగానే ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో కదలిక కూడా ఎక్కువగానే ఉంది. అందుకే అతి భారీ వర్షాలు కురిసేందుకు అనుకూలమైన వాతావరణం ఉంది.

ఇలాంటి తుఫాన్ విరుచుకుపడే విధంగా ఉన్నప్పుడు పాఠశాలలకు సెలవులు ఇస్తుంటారు. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం ఈ తుఫాన్ ప్రభావం ఏపీపై నవంబర్ 28, 29, 30 తేదీల్లో ఉండబోతున్నట్లు తెలిపింది. అందువల్ల మూడు రోజులు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ మూడు రోజులు సెలవులు ఇస్తే ఆ తర్వాత డిసెంబర్ 1వ తేదీ ఆదివారం ఆరోజు సెలవు ఉంటుంది. ఈ తుపాన్ ప్రభావం డిసెంబర్ 1 వరకు ఉంటుందని ఐఎండీ చెబుతోంది. డిసెంబర్ 3 వరకు ఉంటుందని ఏపీ వాతావరణ అధికారులు అంటున్నారు. ఫెంగల్ తుపాన్ విరుచుపడే సమయంలో తీవ్రమైన గాలులు వీస్తుంటాయి. గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గురువారానికి వీటి వేగం మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ గాలి, వాన బీభత్సంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లడం అంత మంచిది కాదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

అటు విద్యార్థుల పేరెంట్స్ కూడా 29,30 తేదీల్లో సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ రెండు రోజులు కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్వయంగా చెప్పింది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఏపీ మొత్తం సెలవులు ఇవ్వాల్సిన అవసరం లేదని..తుపాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. 

Tags:    

Similar News