Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం..రానున్న రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్
Rain Alert: ఏపీకి వర్ష సూచన ఉన్నట్లుగా విశాఖ వాతావరణ కేందరం కీలక అప్ డేట్ ను అందించింది. దక్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం రానున్న 24గంటల్లో మరింత బలపడింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, ఉత్తరకోస్తాలో రానున్న 2రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఈనెల 28,29 తేదీన ఏపీలోని నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, శ్రీకాకుళం,విశాఖ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అలర్జ్ జారీ చేసింది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని వివరించింది. దక్షిణ కోస్తాలో మత్స్య కారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇప్పటికే కోస్తాంధ్రలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేసినట్లుగా వెల్లడించింది. ఉత్తర కోస్తా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
దక్షిణ బంగాళాఖాతం, తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో వాయుగుండం కేంద్రీక్రుతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 30 కిలీమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 530 కిలీమీటర్లు, నాగపట్నానికి 810 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 920, చెన్నైకి ఆగ్నేయంగా 1000కిలోమీటర్ల దూరంలో కేంద్రీక్రుతమైఉందని ఎస్ డీఎమ్ఏ తెలిపింది. రాగల 24గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ తెలిపింది.
కాగా ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు అయ్యింది. ఏపీలో తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈనెల 29న జరగాల్సిన పర్యటన రద్దు చేస్తూ పీఎంవో నిర్ణయించింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే.