రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు: ప్రకాశం ఎస్పీ ఎదుట విచారణకు హాజరైన రిటైర్డ్ ఎఏస్పీ విజయ్ పాల్

RRR Custodial Torture Case: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ మంగళవారం హాజరయ్యారు.

Update: 2024-11-26 06:31 GMT

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు: ప్రకాశం ఎస్పీ ఎదుట విచారణకు హాజరైన రిటైర్డ్ ఎఏస్పీ విజయ్ పాల్

Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ మంగళవారం హాజరయ్యారు. విజయ్ పాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు నవంబర్ 25న కొట్టివేసింది. దీంతో ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యారు. వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ సీపీ నుంచి నర్సాపురం ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు.

2021లో రఘురామకృష్ణరాజును ఓ కేసులో అరెస్టు చేసిన సమయంలో చిత్రహింసలు పెట్టారని విజయ్ పాల్ పై రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు సీతారామంజనేయులు, సునీల్ కుమార్ పై కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలని విజయ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు.

Tags:    

Similar News