Pawan Kalyan: రెండు చోట్ల ఓటమి నుంచి ఇతర రాష్ట్రాల్లో గెలుపును శాసించే స్థాయికి
Pawan Kalyan: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ఊహించని రీతిలో భారీ విజయాన్ని నమోదు చేసింది.
Pawan Kalyan: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ఊహించని రీతిలో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తరపున జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన 11 చోట్ల విజయం సాధించింది. మహారాష్ట్రలో బీజేపి తరపున స్టార్ క్యాంపెయినర్‌గా పవన్ కళ్యాణ్ పలు బహిరంగ సభలతో పాటు ర్యాలీలలో పాల్గొన్నారు. ఇక పవన్ ప్రచారం చేసిన అన్ని చోట్ల ఎన్డీయే కూటమి అభ్యర్థులు గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది.
పూణె కంటోన్మెంట్, బల్లార్‌పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్ రూరల్, హదప్సర్, కస్బాపేత్ తదితర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 70 శాతం కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్లగొడుతూ ఎన్డీయే కూటమికి విజయం సాధించిపెట్టారు. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పవన్ ప్రచారానికి పబ్లిక్ భారీగా వచ్చారని ఆ పార్టీ తెలిపింది. మహారాష్ట్రలో కూటమి ఇంత ఘన విజయాన్ని ఎవరూ ఊహించలేదు. అందరూ 150 వరకు అంచనా వేశారు. కానీ అక్కడ కూటమే ఊహించని అద్భుతం జరిగింది. 288 సీట్లు ఉండగా.. మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు రావడానికి పవన్ కళ్యాణ్ కలిసి రావడం ఒక కారణం అని కొంతమంది రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. అలాగే మహారాష్ట్రలో ప్రభంజనానికి కూడా పవన్ కళ్యాణ్ ఒక కారణమని ఆయన మిత్రులు, అనుచరవర్గాలు చెబుతున్న మాట.
తెలుగునాట ఉన్న తన అభిమానులను పవన్ మహారాష్ట్రలో కూడా సాధించగలిగారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం, వారి విజయం వెనుక పవన్ పాత్రను గుర్తించడంపై తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ప్రజా సమస్యలపై పోరాడుతూ వచ్చారు. ఆ తర్వాత 2019లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2024లో పిఠాపురం నుంచి భారీ మెజార్టీలో విజయం సాధించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. అందుకే పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ చాలా ఇన్స్పిరేషనల్‌గా ఉందనేది పరిశీలకుల మాట. రెండు చోట్ల ఓటమి పాలైన పవన్.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా గెలుపును శాసించే స్థాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయంగా వారు చెబుతున్నారు.