RGV: రాంగోపాల్‌వర్మ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు

RGV Arrest: డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు ఒంగోలు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు రాంగోపాల్ వర్మ విచారణకు హాజరుకావాల్సి ఉంది.

Update: 2024-11-25 05:27 GMT

RGV: రాంగోపాల్‌వర్మ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన ఒంగోలు పోలీసులు

RGV Arrest: డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు ఒంగోలు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు రాంగోపాల్ వర్మ విచారణకు హాజరుకావాల్సి ఉంది. విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు.

అయితే తాను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని.. వారం రోజులు గడువు కావాలని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువు ఇచ్చారు. దీంతో ఇవాళ విచారణ జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్పింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News