Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Update: 2024-11-24 01:40 GMT

Cyclone Dana: దానా సైక్లోన్ దారెటు?

Ap Rains: ఏపీ రైతులకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం ఈనెల 25నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తూర్పు హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో నవంబర్ 25న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ ఆ తర్వాత రెండు రోజుల్లో తమళినాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు.

వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 27,28,29 తేదీ భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరశాఖ తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించంది. అప్రమత్తంగా ఉండాలని..రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటికి బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా సహకారం అందించాలన్నారు.

తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో నవంబర్ 29వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేటి నుంచి నవంబర్ 28వ తేదీ వరకు కూడా పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. నవంబర్ 28వ తేదీ వరకు ఎలాంటి వర్ష సూచన లేదని..ఎలాంటి హెచ్చరికలు కూడా లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉటుందని తెలిపింది.

Tags:    

Similar News