New Ration Cards: ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులకు అప్పటి నుంచే దరఖాస్తులు..!
AP New Ration Cards: పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది.
New Ration Cards: పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. కొత్తేడాది కానుకగా కొత్త రేషన్ కార్డులు అందించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో గత కొన్ని రోజులుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి ఇందుకోసం దరఖాస్తులు స్వీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు సమాచారం.
ఇక దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 28వ తేదీ వరకు కొనసాగనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులు కాకుండా కొత్త డిజైన్‌తో కార్డులను అందించనున్నారు. రేషన్ కార్డులపై కుటుంబ సభ్యుల ఫొటోలు, వివరాలతో పాటు క్యూ ఆర్ కోడ్ అందించనున్నారు. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే వివరాలు మొత్తం వచ్చేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గతంలో మంజూరు చేసిన రేషన్ కార్డుల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు కూడా రేషన్ కార్డులు ఇచ్చారన్న కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కూటమి ప్రభుత్వం వివరాలన్నింటినీ సేకరించి వారి రేషన్ కార్డులను రద్దు చేసి అర్హులైన వారికి మాత్రమే కార్డులను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రేషన్ కార్డులు జారీ చేశారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.