Vijay Paul: ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్‌కు రిమాండ్

Update: 2024-11-27 15:24 GMT

Former AP CID officer Vijay Paul remanded: ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజును గత ప్రభుత్వ హయాంలో కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌​కు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. విజయ్​ పాల్‌ను మంగళవారం రాత్రి ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్​ చేశారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయం నుంచి బుధవారం మధ్యాహ్నం గుంటూరు కోర్టుకు తీసుకువచ్చారు. గుంటూరు కోర్టుకు తీసుకురావడానికంటే ముందుగానే ఒంగోలులో వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయ్ పాల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు.

రఘు రామకృష్ణ రాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఐపీఎస్ ఆఫీసర్స్ పివి సునిల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రోద్భలంతోనే విజయ్ పాల్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారనేది ఆయనపై నమోదైన అభియోగం. ఇదే ఆరోపణలపై విజయ్ పాసల్ పై పోలీసులు అటెంప్టెడ్ మర్డర్ కేసు మోదు చేశారు.

ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. విజయ్ పాల్ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు సోమవారం కోర్టు తేల్చిచెప్పింది. దీంతో విచారణ నిమిత్తం మంగళవారం ఆయన ఒంగోలులో పోలీసులు ఎదుట హాజరయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ ​విజయ్‌ పాల్‌ను ప్రశ్నించారు.​ అనంతరం ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకాశం పోలీసులు ప్రకటించారు.

Tags:    

Similar News