Pawan Kalyan: ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ.. చర్చించిన అంశాలు

Update: 2024-11-27 14:42 GMT

Pawan Kalyan meets PM Modi in parliament PMO: ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని పీఎంఓలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏపీకీ రావాల్సిన నిధులు, పలు పథకాల నిర్వహణలో కేంద్రం నుండి అందాల్సిన ఆర్థిక సాయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జలజీవన్ మిషన్ పథకం పొడిగించాల్సిందిగా పవన్ కోరినట్లు సమాచారం. అలాగే జలజీవన్ మిషన్ పథకం నిర్వహణ కోసం కేంద్రం నుండి నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు.

ప్రధానితో భేటీ కంటే ముందుగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తోనూ సమావేశమయ్యారు. ఇదే పర్యటనలో ఏపీ బీజేపి చీఫ్ పురందేశ్వరి, టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి (ఒంగోలు ఎంపీ), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసాపురం ఎంపీ) పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీకి వచ్చిన పవన్ కళ్యాణ్ తో వీరి భేటీ మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది.

కలిసిన ప్రతీసారి అదే ఫీలింగ్ - పవన్ కళ్యాణ్

గాంధీ నగర్‌లో తొలిసారిగా ప్రధానిని కలిసినప్పటి నుండి ఇప్పటివరకు కలిసిన ప్రతీసారి ఆయనతో భేటీ స్ఫూర్తిదాయకంగానే ఉంటోందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రధానీతో భేటీ అనంతరం ఎక్స్ ద్వారా ఆ ఫోటోలు షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధానికి కంగ్రాట్స్ చెప్పిన పవన్

ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపి అత్యధికంగా 132 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల ఫలితాల తరువాత ప్రధాని మోదీని కలుసుకోవడం ఇదే తొలిసారి కావడంతో పవన్ కళ్యాణ్ ప్రధానికి కాంగ్రాట్స్ చెప్పారు. 

Tags:    

Similar News