రోడ్డుపై బైఠాయించిన మహిళలు, భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. చిలకలూరిపేటలో నిలిచిపోయిన చంద్రబాబు కాన్వాయ్‌

Chandrababu Arrest: కాసేపట్లో విజయవాడకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకోనున్నారు.

Update: 2023-09-09 09:28 GMT

రోడ్డుపై బైఠాయించిన మహిళలు, భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. చిలకలూరిపేటలో నిలిచిపోయిన చంద్రబాబు కాన్వాయ్‌

Chandrababu Arrest: కాసేపట్లో విజయవాడకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకోనున్నారు. ఆయనను ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు హాజరుపర్చనున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు ఆరోపిస్తున్న సీఐడీ.. ఆయనను నంద్యాలలో అరెస్ట్ చేసింది. నంద్యాల నుంచి విజయవాడకు చంద్రబాబును తరలిస్తున్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

చంద్రబాబు కాన్వాయ్‌ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. చిలకలూరిపేట జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణుల రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై మహిళలు భారీగా బైఠాయించడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో.. చిలకలూరిపేటలో చంద్రబాబు కాన్వాయ్‌ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన మహిళా కానిస్టేబుళ్లు.. ఆందోళన చేస్తున్న మహిళలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Tags:    

Similar News