Tirumala: తిరుమలలో రీల్స్.. దివ్వెల మాధురిపై కేసు నమోదు

Tirumala: తిరుమల శ్రీవారి దేవస్థానంలో రీల్స్ చేసిన దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2024-10-11 01:15 GMT

Tirumala: తిరుమలలో రీల్స్.. దివ్వెల మాధురిపై కేసు నమోదు

Tirumala: తిరుమల శ్రీవారి దేవస్థానంలో రీల్స్ చేసిన దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 7న దివ్వెల మాధురి, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ఎదుట ఆమె రీల్స్‌ చేయడంపై విమర్శలు వచ్చాయి.

టీటీడీ నిబంధనలు, సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ శ్రీవారి ఆలయంలో రీల్స్ చేయడంపై టీటీడీ సీరియస్ అయ్యింది. శ్రీవారి ఆలయ ప్రాంగణం, పుష్కరిణిలో రీల్స్ చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. తిరుమల ఆలయం ఏవీఎస్‌వో ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Tags:    

Similar News