మచిలీపట్నంలో ఉద్రిక్తత... కొల్లు రవీంద్ర అరెస్ట్

-మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం -టీడీపీ-వైసీపీ పోటాపోటీ నిరసనలు --ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ దీక్షలు -ప్రతిపక్ష తీరును నిరసిస్తూ వైసీపీ ఆందోళన -కొల్లు రవీంద్ర 36 గంటల నివధిక దీక్షభగ్నం -టీడీపీ ముఖ్య నేతల అరెస్ట్‌ -ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరింపు

Update: 2019-10-11 05:34 GMT

మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ, ప్రతిపక్ష తీరుకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనలకు పిలుపునిచ్చాయి. అయితే ఎవరికి అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇసుక కృత్రిమ కొరతను నిరసిస్తూ మచిలీపట్నం కోనేరు సెంటర్ దగ్గర తలపెట్టిన 36 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత పలువురు ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. ప్రధాన కూడళ్లు దగ్గర పోలీసులు భారీగా మొహరించారు.   

Full View

Tags:    

Similar News