తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఉన్న చీకటి ఒప్పందాలతో సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు కేసీఆర్ నిధులు సహాయం చేస్తే.. ఇప్పుడు జగన్.. కేసీఆర్‌కు నీళ్ల సహాయం చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ఎత్తును తగ్గిస్తే.. ప్రాజెక్టుకు అర్థం లేదని, అసలు.. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఉందని అన్నారు నిమ్మల. కనీస అనుభవంలేని సంస్థకు పోలవరం నిర్మాణ బాధ్యతలు అప్పగించారని మండిపడ్డారు నిమ్మల రామానాయుడు.