Supreme Court: అమరావతిలో ఇళ్లస్థలాలకు కేటాయింపులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Supreme Court: హైకోర్టు తుది తీర్పునకు లోబడి కేటాయింపులు

Update: 2023-05-17 10:27 GMT

Supreme Court: అమరావతిలో ఇళ్లస్థలాలకు కేటాయింపులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Supreme Court: అమరావతి ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. R-5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని , పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బుధవారం తీర్పు వెలువరించింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఆర్‌5 జోన్‌లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బెంచ్ పేర్కొంది. చట్ట ప్రకారమే ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని , అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 

Tags:    

Similar News