Chittoor: మురుగు కాలువలో దిగి ఉప సర్పంచ్‌ అర్ధనగ్న ప్రదర్శన.. అధికారులకు విన్నవించిన ఫలితం లేదని ఆవేదన

Chittoor: ఆధ్వానంగా మారిన పారిశుద్ధ్యంపై ఉప సర్పంచ్‌ వినూత్న నిరసన

Update: 2023-07-09 09:32 GMT
Sub-Sarpanch in Drainage water At Chittoor

Chittoor: మురుగు కాలువలో దిగి ఉప సర్పంచ్‌ అర్ధనగ్న ప్రదర్శన.. అధికారులకు విన్నవించిన ఫలితం లేదని ఆవేదన

  • whatsapp icon

Chittoor: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సొంత మండలంలో ఆయనో ఉప సర్పంచ్. గ్రామంలో ఏరులా ప్రవహిస్తున్న మురుగు నీటి కాలువ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగు చెందిన ఉప సర్పంచ్ కృష్ణయ్య వినూత్న నిరసనకు దిగారు. తానే స్వయంగా మురుగునీటి కాలువలో దిగి అర్ధనగ్న ప్రదర్శనతో తన ఆవేదనను, ప్రజలు ఎదుర్కొంటున్న మురుగు నీటి సమస్యను వ్యక్తం చేశారు.

ఈ సంఘటన చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని బ్రాహ్మణం గ్రామంలో జరిగింది. గ్రామంలో మురుగునీరు ఏరులై కాలువలా ప్రవహిస్తుండడంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని, మురుగు నీటిలో పిల్లలు ప్రమాదవశాత్తు పడితే ప్రాణాలు పోతాయని అంటూ ఉప సర్పంచి కాలువలో దిగి నిరసన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి మురుగునీటి కష్టాల నుంచి తమకు విముక్తి కల్పించాలని ఆయన ప్రాధేయపడ్డారు.

Tags:    

Similar News