Nandyala: బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు వ్యతిరేకంగా పోస్టర్లు

Nandyala: వైసీపీ నేతలు పనిలేని ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ ఫైర్

Update: 2024-01-11 10:33 GMT
Posters Against BJP And TDP And Janasena Parties

Nandyala: బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు వ్యతిరేకంగా పోస్టర్లు

  • whatsapp icon

Nandyala: నంద్యాల జిల్లాలో పోస్టర్ల ప్రత్యక్ష్యం ఉద్రిక్తతకు దారితీశాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు వ్యతిరేకంగా గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. మూడు పార్టీలు ఒక్కటేననే కామెంట్స్‌తో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లపై స్పందించిన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పద పోస్టర్లంటూ వాటిని చించివేసి తగులబెట్టారు. పోస్టర్లు ఏర్పాటు చేసిన అనుమానిత వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు టీడీపీ నాయకులు భారీగా చేరుకున్నారు. మత సామరస్యానికి ప్రతీక అయిన నంద్యాలో వైసీపీ నేతలు పనిలేని ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ మండిపడుతోంది. వెకిలి రాతలతో పోస్టర్లు అంటించడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమంటూ విమర్శలు చేశారు.

Tags:    

Similar News