విజయవాడలో హై అలర్ట్‌.. పవన్‌ ప్రత్యేక విమానానికి పోలీసుల అనుమతి నిరాకరణ

Vijayawada: విజయవాడలో హై అలర్ట్‌ నెలకొంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు చేపడుతున్నారు.

Update: 2023-09-09 11:48 GMT

విజయవాడలో హై అలర్ట్‌.. పవన్‌ ప్రత్యేక విమానానికి పోలీసుల అనుమతి నిరాకరణ

Vijayawada: విజయవాడలో హై అలర్ట్‌ నెలకొంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు చేపడుతున్నారు. పవన్‌ ప్రత్యేక విమానానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. చంద్రబాబును కలిసేందుకు పవన్‌కు అనుమతిలేదని పోలీసులు చెబుతున్నారు. ఉద్రిక్తతల కోసమే పవన్‌ వస్తున్నారని చెబుతున్న పోలీస్‌ వర్గాలు.. పవన్‌ ప్రత్యేక విమానాన్ని అనుమతించొద్దని.. ఇప్పటికే ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం పంపినట్టు సమాచారం. ఇక.. చంద్రబాబు కుటుంబసభ్యులకు మాత్రమే పర్మిషన్‌ ఉందని, భువనేశ్వరి, లోకేష్‌లను అనుమతిస్తామని అంటున్నారు పోలీసులు.

Tags:    

Similar News