నో హారన్ జోన్ గా తిరుమల

Update: 2020-06-19 02:19 GMT

తిరుమల కొండపై నో హారన్ జోన్ గా ప్రకటిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి విరుద్ధంగా వ్యవహిరస్త అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. అధికార కార్యాలయలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో శబ్ధాల వల్ల వారి విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా నో హారన్ జోన్ గా ప్రకటిస్తున్నారు. అయితే తాజాగా తిరుమల కొండపై ఇదే విధానాన్ని అమల్లో తెచ్చేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు వాహనాలకు వినియోగిస్తున్న హారన్ లలో శబ్ధ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల కొండపై గోవింద నామస్మరణకు ఆటంకం కలుగుతోంది. దీంతో పాటు ఇక్కడ అనేక రకాలైన విధులు నిర్వహించే వారికి ఆటంకం కలుగుతోంది. ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు తిరుపతి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలను ఇక నుంచి 'నో హారన్' జోన్ గా ప్రకటిస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి వెల్లడించారు. ఇకపై తిరుమలలో ఎవరూ కూడా హారన్ కొట్టకూడదని.. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేవలం గోవింద నామ స్మరణ మాత్రమే తిరుమల కొండపై వినిపించాలన్నారు. అటు భవిష్యత్తులో తిరుపతి నగరాన్ని కూడా నో హారన్ జోన్ లోకి తీసుకొస్తామని ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు.

ఇదిలా ఉంటే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో మరింత మందికి దర్శనం కల్పించే వెసులుబాటు ఉండటంతో అదనపు కోటాను విడుదల చేస్తున్నట్లు టీటీడీ ఈ మేరకు ఓ ప్రకటనలో తెలియజేసింది. రోజుకు మూడు వేల టికెట్ల చొప్పున.. రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు సంబంధిత టికెట్లన్నింటిని టీటీడీ విక్రయించింది

Tags:    

Similar News