చంద్రబాబుపై వ్యాఖ్యలు.. డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది.

Update: 2024-11-11 06:30 GMT

చంద్రబాబుపై వ్యాఖ్యలు.. రామ్ గోపాల్ వర్మకు పోలీసుల నోటీసులు..

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బ్రహ్మణి వ్యక్తిత్వాన్ని కించపర్చేలా పోస్టులు పెట్టారని ఆయనపై టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యూహం సినిమాను 2024 మార్చి 2న ఈ సినిమాను విడుదల చేశారు.ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టులో అప్పట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సినిమాపై ఏర్పాటు చేసిన కమిటీ సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగాయి. వాస్తవానికి ఈ సినిమా 2024 ఫిబ్రవరి 23న విడుదల కావాలి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలను ఈ సినిమాలో చూపారు. వైఎస్ఆర్ మరణం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేవరకు జరిగిన పరిణామాలను ఇందులో చూపారు.

ఈ సినిమా విషయంలో అప్పట్లో జరిగిన ఓ టీవీ డిబేట్ లో ఒకరు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ విషయమై రామ్ గోపాల్ వర్మ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన స్వయంగా తన ఫిర్యాదును డీజీపీకి 2023 డిసెంబర్ 27న అందించారు.

Tags:    

Similar News