Pawan Kalyan: పెళ్లి పత్రికపై పవన్‌ కల్యాణ్‌ ఫొటో

Pawan Kalyan: అభిమానాన్ని చాటుకున్న పవన్‌ వీరాభిమాని * ఈ నెల 21న వివాహం చేసుకోనున్న పవన్‌ కుమార్‌

Update: 2021-08-17 07:51 GMT
Pawan kalyan Fan Printed the Photo on Wedding Card

పెళ్లి పత్రిక పై పవన్ కళ్యాణ్ ఫోటో (ఫైల్ ఇమేజ్)

  • whatsapp icon

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ అంటే ప్రాణమిస్తారు కొందరు. మరికొందరైతే దేవుడితో సమానంగా చూస్తారు. ఇంకొందరు ఆయనకు ఓ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును ఇస్తారు. అలాంటి ఘటనే ఒకటి విశాఖలో వెలుగుచూసింది. వెడ్డింగ్‌ కార్డుపై పవన్‌ కల్యాణ్‌ ఫొటో ముద్రించాడు ఓ వీరాభిమాని. పెదగంట్యాడ మండలం సీతానగరానికి చెందిన ఈశ్వర్రావు, ఆదిలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు పవన్‌ కుమార్‌. అతడి తల్లిదండ్రులకు పవన్‌ అంటే ఆది నుంచి అభిమానమే. అందుకే.

పెద్ద కుమారుడికి పవన్‌ కుమార్‌ అనే పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టు పవన్‌ కల్యాణ్‌కు వీరాభిమాని పవన్‌ కుమార్‌. స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఈ నెల 21న పవన్‌ కుమార్‌ వివాహం చేసుకోనున్నాడు. పెళ్లి పత్రికపై పవన్‌ కల్యాణ్‌ ఫొటో ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. పవన్‌ తనకు భగవంతుడితో సమానమని చెబుతున్నాడు ఈ పవన్‌ కుమార్‌.

Tags:    

Similar News