చీరాలలో వైసీపీ నేతల మధ్య బాహాబాహీ

Update: 2020-12-26 14:26 GMT
చీరాలలో వైసీపీ నేతల మధ్య బాహాబాహీ
  • whatsapp icon

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నేతల మధ్య మాటలు భగ్గుమన్నాయి. స్టేజ్‌పైనే ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావుల మధ్య వాగ్వాదం జరిగింది. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే బలరాంని గెలిపించాలని పాలేటి రామారావు అంటే ఇది రాజకీయాలు మాట్లాడే వేదిక కాదని పోతుల సునీత అడ్డుకున్నారు. అధినేత ఇచ్చే టికెట్ విషయం ఇప్పుడేందుకని సునీత ఫైర్‌ అయ్యారు. దీంతో కోపంతో ఊగిపోయిన బలరాం సునీతను నెట్టేశారు.

Tags:    

Similar News