Night Curfew: ఏపీలో మరో వారంపాటు నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు

Night Curfew: ఏపీలో మరో వారం పాటు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.

Update: 2021-07-20 09:44 GMT

Night Curfew: ఏపీలో మరో వారంపాటు నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు

Night Curfew: కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలుంటాయని స్పష్టం చేసింది. ఏపీలో కోవిడ్‌ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ప్రజలు కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆ‍యన ఆదేశించారు. జన సమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయన్నారు సీఎం జగన్‌.

ఇక థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచివున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం నస్నద్ధంగా ఉండాలని సూచించారు సీఎం జగన్‌. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో నిర్మించ తలపెట్టిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలన్నారు. పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలని ఆదేశించారు. కమ్యూనిటీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలన్నారు సీఎం జగన్‌.

మరోవైపు ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని అన్నారు సీఎం జగన్‌. విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31వేల 796 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామన్నారు. 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత ప్రయారిటీగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. గడిచిన మే నెల నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రులకు 35 లక్షల కోవిడ్ వ్యాక్సిన్లను కేటాయించగా కేవలం 4లక్షల 63వేల 590 డోసులు మాత్రమే వినియోగించారు. దీంతో ఆ మిగిలిన డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని సీఎం జగన్‌ కేంద్రాన్ని కోరనున్నారు. 

Tags:    

Similar News