సీఎం జగన్ పెళ్లి రోజు.. జగన్ పెళ్లి నాటి ఫొటో పోస్టు చేసిన రోజా

Update: 2020-08-28 11:47 GMT
సీఎం జగన్ పెళ్లి రోజు.. జగన్ పెళ్లి నాటి ఫొటో పోస్టు చేసిన రోజా
  • whatsapp icon

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెళ్లిరోజు. 1996 ఆగస్టు 28న వైఎస్ జగన్, భారతిరెడ్డిలకు వివాహం జరిగింది. 24 వసంతాలు పూర్తయ్యాయి. జగన్, భారతిరెడ్డిలకు ఇద్దరు కుమార్తెలు. హర్షరెడ్డి, వర్షారెడ్డి. హర్షారెడ్డి ఇటీవల పారిస్‌లోని ప్రఖ్యాత బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ పొందారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు జగన్, భారతిలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా జగన్, వైఎస్ భారతి దంపతులకు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా శుభాకాంక్షలు తెలిపారు. 'జగన్ అన్న, వదినమ్మ... హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ' అంటూ రోజా ట్వీట్ చేశారు. వారిద్దరూ ఆదర్శప్రాయమైన జంటగా కొనసాగాలని అభిలషించారు. ఈ దినం ఎంతో ఆనందభరితంగా సాగాలని ఆకాంక్షించారు. అంతేకాదు, జగన్-భారతిల పెళ్లి నాటి ఫొటోను కూడా రోజా పంచుకున్నారు.






Tags:    

Similar News