Annadata Sukhibhava Scheme: ఒక్కో రైతు ఖాతాలో రూ. 20వేలు ..ఏపీలో అన్నదాత సుఖీభవ పథకంపై మంత్రి కీలక ప్రకటన

Update: 2024-12-06 03:48 GMT

Annadata Sukhibhava Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే దీపం 2 పథకం కింద ఫ్రీగా గ్యాస్ సిలిండర్ల స్కీంను అమలు చేస్తోంది. మిగిలిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. అయితే ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభవ స్కీముకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ అందిస్తామని తెలిపారు. కేంద్రం ఇచ్చే రూ. 6వేలతో కలిపి ఏడాదికి మొత్తం రూ. 20వేలు అందిస్తామని చెప్పారు. రాబోయే మూడు నెలలు మిర్చి సీజన్ లో ఇబ్బందులు లేకుండా క్రయవిక్రయాలు జరిగేలా చూడాలని సూచించారు.

ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసిన 48గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు కృష్ణా డెల్టాలో 30 రోజుల్లో రావాల్సిన ధాన్యం, వాతావరణ మార్పుల రైతులు యాంత్రాలతో నూర్పిడి చేస్తూ..మూడు రోజుల్లోనే తీసుకువస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యమైనప్పటికీ.. అన్ని సమస్యలనూ అధిగమిస్తామని చెప్పారు. త్వరలోనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.

గుంటూరు మిర్చి యార్డులో రూ. 350కోట్ల అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మిర్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని..గత 5ఏళ్లకాలంలో మిర్చియార్డులోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని అన్నారు మంత్రి అచ్చన్నాయుడు. మిర్చియార్డులోని అన్ని విభాగాలను సమన్వయం చేస్తామని చెప్పుకొచ్చారు.

కాగా ఏపీలో ఎన్నికల సమయంలో కూటమి..సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవం పీఎం కిసాన్ కింద ఏడాదికి రూ. 20వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ స్కీముకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అర్హత ఉన్న ప్రతిరైతుకు రూ. 20వేలు అందిస్తామని చెబుతున్నారు. ఈ మేరకు ఇటీవల 2024-25 బడ్జెట్ లో ఈ స్కీమునకు రూ. 4,500కోట్లను కేటాయించారు. రాష్ట్రంలో భూమిలేని సాగుదారులకు రూ. 20వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దీనికోసం బడ్జెట్ లో రూ. 1000 కోట్లను కేటాయించారు.

Tags:    

Similar News