Minister Gudivada Amarnath: జనసేన పొలిటికల్ పార్టీ కాదు.. సినిమా పార్టీ..

Minister Gudivada Amarnath: జనసేన పొలిటికల్ పార్టీ కాదని, సినిమా పార్టీ అని విమర్శించారు మంత్రి అమర్‌నాథ్.

Update: 2022-11-01 12:08 GMT

Minister Gudivada Amarnath: జనసేన పొలిటికల్ పార్టీ కాదు.. సినిమా పార్టీ..

Minister Gudivada Amarnath: జనసేన పొలిటికల్ పార్టీ కాదని, సినిమా పార్టీ అని విమర్శించారు మంత్రి అమర్‌నాథ్. జనసేన ఒక విధానం సిద్ధాంతం లేని పార్టీ అని, దాని గురించి తాము మాట్లాడవలసిన అవసరం లేదన్నారు. సినిమాల్లో ఉన్న వ్యక్తి సినిమా స్టైల్‌లో మాట్లాడితే సినిమాల్లో పనికొస్తుందని ప్రజాస్వామ్యంలో పనికిరాదని అన్నారు. పవన్ కళ్యాణ్ కోసం కాపులు సమావేశం పెట్టినట్లు చిత్రీకరిస్తున్నారని అన్నారు. అన్ని వర్గాలతో తాము తరచు సమావేశాలు నిర్వహించుకుంటున్నామని మంత్రి చెప్పారు.

జనసేన నేతలు, కార్యకర్తలు.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే.. పవన్ మాత్రం చంద్రబాబు సీఎం కావాలనుకుంటున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు. పవన్ కంటే కేఏ పాల్ నయమని, 175 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారన్నారు. అలాగే పవన్ కూడా 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక ఊహించినదేనని, వారు కలవడం, విడిపోవడం సహజమేనన్నారు. కాపుల కోసం ముద్రగడ పోరాటం చేసినప్పుడు, పవన్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.

Tags:    

Similar News