Ram Gopal Varma: నేను విచారణకు రాలేను..వారం రోజులు గడువు కావాలి: ఆర్జీవీ
Ram Gopal Varma: సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) కేసు విచారణ మంగళవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో జరగాల్సి ఉండేది.
Ram Gopal Varma: పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). ప్రస్తుతం తాను షూటింగ్ లో బిజీగా ఉన్నానని..విచారణ హాజరుకాలేనని..పోలీసులకు సహకరిస్తానని తెలిపారు. వారం రోజులు పాటు గడువు కావాలని కోరుతూ మద్దిపాడు పోలీసులకు ఆర్జీవీ వాట్సాప్ లో మెసేజ్ చేశారు. అయితే రాంగోపావల్ వర్మ షూటింగ్ లో ఉన్నారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేష్ లపై ఆర్జీవీ ట్విట్టర్ లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రాంగోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది.
సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేసు విచారణ మంగళవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో జరగాల్సి ఉండేది. విచారణకు హాజరుకావాలంటూ ఆర్జీవీకి మద్దిపాడు పోలీసులు ఈమధ్యే నోటీసులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేష్ ఫోటోలు ఆర్జీవీ మార్ఫింగ్ చేశాడని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు అయ్యింది.
మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండలకార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 10వ తేదీన ఏడు సెక్షన్లతో ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదు అయిన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మని విచారించేందుకు పోలీసులు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేశారు. అయితే తాను షూటింగ్ లో ఉన్నానని..వారం రోజుల గడువు కావాలని కోరుతూ ఈ మేరకు పోలీసులు వాట్సాప్ మెసేజ్ పెట్టారు.